: విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
తొలుత అధికారులు పైలెట్లకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని క్షేమంగా కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానంలో మొత్తం 113 మంది ప్రయాణికులున్నారు. వీరందరినీ సమీపంలోని నొవాటెల్ హోటల్ కు తరలించారు.