: అదేపనిగా కూర్చుని వుండే వారికి పొంచి వున్న ముప్పు!
కూర్చున్న చోటు నుంచి కదలకుండా అదేపనిగా కుర్చీకి అతుక్కుపోయి వుండే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక! నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు ... అలాగే కదలకుండా కూర్చొని వుంటే కనుక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తప్పదంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి వారు కేన్సర్, మధుమేహం, అధికరక్తపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా వుందని, ఆస్ట్రేలియాలో జరిగిన తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.
45-64 ఏళ్ల మధ్య వయస్కులైన 2,67,000 మందిపై జరిగిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ ప్రభావం మరీ ముఖ్యంగా మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా వుండడం గమనించదగ్గ విషయం. కాబట్టి, ముఖ్యంగా కంప్యూటర్లకు అతుక్కుపోయి పనిచేసే వాళ్ళు, అదే పనిగా కూర్చోకుండా మధ్యలో కాస్సేపు లేచి, అలా నాలుగడుగులు వేసి వస్తుండాలి.