: ఆక్రమించిన భూములపైనే వైఎస్సార్సీపీ ఆసక్తి: హరీష్ రావు


హైదరాబాద్ లో ఆక్రమించిన భూములపైనే వైఎస్సార్సీపీ ఆసక్తి చూపిస్తోందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పర్యటనలో మద్దతు తెలిపిన విజయమ్మ, ఇప్పుడు సమైక్యవాదాన్ని తలకెత్తుకున్నారని ఆరోపించారు. విజయమ్మ రాసిన బహిరంగ లేఖతో వైఎస్సార్సీపీ అవకాశవాద పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. సీమాంధ్ర ర్యాలీలకు ప్రభుత్వం ఎస్కార్ట్ కల్పించి రక్షణ ఏర్పాట్లు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కోసం శాంతి ర్యాలీ చేస్తుంటే అరెస్టు చేస్తారా? ఇదేనా సమైక్య న్యాయం? అంటూ ప్రశ్నించారు. ముల్కీ అమర వీరులను స్మరిస్తూ ర్యాలీ చేస్తున్న నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News