: నిఘా, తనిఖీలు పెంచండి: అనురాగ్ శర్మ
హైదరాబాదులోని షాపింగ్ మాల్స్, భవనాల్లోకి వచ్చి వెళ్లే వ్యక్తులపై నిఘా పెంచాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. అలాగే స్టార్ హోటళ్లు, అపార్ట్ మెంట్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల తనిఖీ పరికరాలను ఏర్పాటు చేసి ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యమైన సంస్థల చుట్టు పక్కల అనుమానిత ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, కార్లు వంటివి నిలిపి ఉంచకుండా చర్యలు తీసుకోవాలని అనురాగ్ శర్మ నగరంలోని భవనాల యజమానులకు సూచించారు.