: 23 కు చేరిన హెచ్ పీసీఎల్ మృతుల సంఖ్య
విశాఖ హెచ్ పీసీఎల్ లో గతనెల జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న నలుగురు బాధితులు ఇవాళ మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 23 కు చేరుకుంది. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన మరో 13 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముంబైలో మరో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు సమాచారం.