: భారతదేశంలో అమ్మాయిగా పుట్టడమే నేరం: 'నిర్భయ' తండ్రి
ఢిల్లీ అత్యాచార ఘటన తొలి తీర్పుపై 'నిర్భయ' తండ్రి తీవ్ర స్థాయిలో స్పందించారు. తీర్పు అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో అమ్మాయిగా పుట్టడమే నేరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాల నేరస్తుడికి మూడేళ్ల శిక్ష విధిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు తీర్పు ఇచ్చిన వెంటనే 'నిర్భయ' తల్లిదండ్రులు పెద్ద పెట్టున రోదించారు. ఈ సందర్భంగా, 'నిర్భయ' తల్లి మాట్లాడుతూ, మూడేళ్ల శిక్ష చాలా తక్కువని, దానికి బదులు అతన్ని ఇప్పుడే వదిలేయటం మంచిదని విలపించారు. ఈ తీర్పును పైకోర్టులో అప్పీలు చేస్తామని 'నిర్భయ' సోదరుడు చెప్పిన సంగతి తెలిసిందే.