: 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రిక ప్రారంభం


ఇంటర్ కాంటినెంటల్ పబ్లికేషన్స్ లిమిటెడ్, హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో వెలువడుతున్న 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రికను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇదే సమయంలో ఈ పత్రిక ఇంటర్నెట్ ఎడిషన్ ను కూడా ఆయన ప్రారంభించారు. వాస్తవ కథనాలు రాయడం వల్ల మీడియా విశ్వసనీయతను కాపాడవచ్చని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. రాజకీయాలు, బిజినెస్ కు సంబంధించిన ఆసక్తికర కథనాలను సాధారణ వార్తలతో కలిపి వేయవద్దని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు హితవు పలికారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, పలు పార్టీల అధినేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News