: ప్చ్.. మాకు అనుమతివ్వడం లేదు: కోదండరాం
తెలంగాణ రాజకీయ జేఏసీ వచ్చే నెల 7న తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతినివ్వడం లేదని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. హైదరాబాద్ లో మంత్రుల నివాస ప్రాంగణంలో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ శాంతి ర్యాలీకి అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. అయితే ఆయన ప్రకటించిన కార్యాచరణపై పలువురిలో అసంతృప్తి నెలకొందని, కేంద్రం తెలంగాణ ప్రకటించిన తరువాత కూడా నిరసనలంటూ ర్యాలీలు, సభలు పెడితే అధిష్ఠానం ఆగ్రహానికి గురికాకతప్పదని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం.