: ఆంటోనీ కమిటీని కలిసిన సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ
రాష్ట్ర విభజన వల్ల ఏర్పడే సమస్యలను ఆంటోనీ కమిటీకి వివరించినట్లు సీమాంధ్ర ఉద్యోగ జేఏసీ నేతలు తెలిపారు. ఢిల్లీలో వారు మాట్లాడుతూ, హైదరాబాద్ తో సీమాంధ్ర ప్రజలకు దశాబ్దాల అనుబంధాలు ముడిపడి ఉన్నాయని ఆంటోనీ కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. విభజన వల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందులు, అనుమానాలు, అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రతిపక్ష నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడులకు వివరించామన్నారు. రాజకీయ నాయకులంతా స్వాతంత్ర్యం రాకముందు ఉన్న సమస్యల్నే ఏకరువు పెడుతున్నారు తప్ప, స్వాతంత్ర్యానంతరం జరిగిన అభివృద్ధిపై ఎవరూ మాట్లాడడం లేదని ఆక్షేపించారు.