: కేంద్ర మంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ


కేంద్ర మంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ తగిలింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. తాము పార్లమెంటులో ప్రజావాణి వినిపిస్తున్నామని, రాజీనామాలకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేసినప్పటికీ సమైక్యవాదులు శాంతించలేదు. కాకమ్మ కబుర్లు తమకు వినిపించవద్దని సమైక్యవాదులు నినాదాలు చేశారు. ప్రజల ఆగ్రహానికి గురై రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఉద్యమకారులు ఆయనకు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News