: తగాదాలు పెట్టి తమాషా చూసేలా ఉంది సోనియా వ్యవహారం: కిషన్ రెడ్డి


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్ర విభజన అంశంలో తగాదాలు పెట్టి తమాషా చూస్తున్నట్టుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుతోందని విమర్శించారు. విభజన విషయంలో కేంద్రం వైఖరి రెచ్చగొట్టేలా ఉందని దుయ్యబట్టారు. అదే సమయంలో రాష్ట్రంలోని విపక్షాలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయని అన్నారు. ఇక జగన్ దీక్షపై వ్యాఖ్యానిస్తూ, జైల్లో దీక్ష చేపట్టడం, ఆపై ఆసుపత్రిలో చేరడం అంతా నాటకంలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News