: తీవ్రవాద దాడులను ఖండించిన చైనా
హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనపై చైనా కాస్త ఆలస్యంగా స్పందించింది. తీవ్రవాద దాడులను ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు చైనా ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి హు చున్ యింగ్ పేర్కొన్నారు.