: కేసీఆర్ కు బెదిరింపు లేఖ పంపిన వ్యక్తి దొరికాడు


కేసీఆర్ కు ఇటీవలే బెదిరింపు లేఖ పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ యువకుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ వ్యక్తి గతంలో మంత్రి ఆనంకూ బెదిరింపు లేఖ రాసినట్టు సమాచారం. కాగా, ఫోన్ లో అమ్మాయిలను వేధించడంలోనూ ఇతగాడు దిట్ట అని పోలీసులు తెలిపారు. 17 ఏళ్ళ ఈ యువకుడు నెల్లూరుకు చెందినవాడని తెలుస్తోంది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కేసీఆర్ ను పదిరోజుల్లో చంపేస్తామంటూ హైదరాబాదులోని తెలంగాణ భవన్ కు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News