: ప్రతి పాఠశాలలోనూ తెలుగు బోధన తప్పని సరి: ముఖ్యమంత్రి


రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలోనూ తెలుగు బోధన తప్పని సరి చేసినట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మన సంప్రదాయాలను పాఠశాలల్లో బోధించేందుకు 25 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. కుటుంబ సంబంధాలు, మహిళలకు గౌరవం, విలువల ప్రాధాన్యం వంటివి పసితనం నుంచే నేర్పాలని సూచించారు. ఉద్యమాలు చేసేవారు శాంతియుతంగా, చట్టపరిధులకు లోబడి నిరసనలు తెలపాలని సీఎం సూచించారు. తమ ప్రభుత్వం, పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోని ప్రభుత్వాలకు ప్రజలు స్వస్తి చెప్పారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News