: లోక్ సభలో కొట్టుకోబోయిన ఎంపీలు
లోక్ సభలో భూసేకరణ బిల్లుపై తీవ్ర చర్చ జరిగింది. ఈ ఆసక్తికర చర్చ సందర్భంగా తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, వామపక్ష సభ్యుడు బాసుదేబ్ ఆచార్యలు ఒక దశలో కొట్టుకోబోయినంత పని చేశారు. ములాయం సింగ్ యాదవ్, జైరాం రమేష్ లు వారికి సర్దిచెప్పి శాంతింపజేశారు. ఈ చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనలేదు. కాగా చర్చలో పాల్గొన్న ములాయం రైతుల నుంచి భూసేకరణకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. బిల్లులో పలు లోపాలు ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. బిల్లుకు మద్దతు తెలుపుతామని, అయితే పార్లమెంటరీ కమిటీతో బిల్లును అధ్యయనం చేయించాలని వామపక్షాలు సూచించాయి.