: భత్కల్ కు రిమాండ్


దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్, మరో ఉగ్రవాది తబ్రేజ్ కు కోర్టు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించింది. దీంతో, భత్కల్, తబ్రేజ్ లను రేపు ఢిల్లీ తరలించనున్నారు. గతరాత్రి ఇండో-నేపాల్ బోర్డర్ వద్ద అరెస్టయిన భత్కల్ ను బీహార్ పోలీసులు నేడు కోర్టులో హాజరు పరిచారు. ఇటీవలే పోలీసులకు పట్టుబడ్డ లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా వెల్లడించిన సమాచారం మేరకు భత్కల్ ను పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News