: 23 మంది సీమాంధ్ర ఎంపీలూ ఉద్యమంలో పాల్గొనాల్సిందే: ఏపీఎన్జీవోలు
23 మంది సీమాంధ్ర ఎంపీలూ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందేనని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలతో తమ భేటీ ముగిసిన సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ లో జరపనున్న సభకు నైతిక మద్దతు తెలిపారన్నారు. ఉద్యమంలో పాల్గొనే విషయంలో రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయం చెబుతామన్నారని అశోక్ బాబు తెలిపారు.