: శ్రీకాకుళంలో గిడుగు రామమూర్తి విగ్రహం తొలగింపు
శ్రీకాకుళంలో రోడ్డు పక్కన ఉన్న గిడుగు వెంకటరామమూర్తి విగ్రహాన్ని తొలగించారు. రోడ్డు విస్తరణ పనుల కోసం ఈ విగ్రహాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. గిడుగు జయంతి నాడే (నేడు ఆయన పుట్టినరోజు) ఆయన విగ్రహాన్ని తొలగించడాన్ని స్థానికులు ఖండించారు. అయితే, ప్రతిఏటా గిడుగు జయంతిని ఘనంగా నిర్వహించే ఇక్కడివారు ఈసారి మర్చిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆంధ్రప్రదేశ్ లో వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు మూలపురుషుడు. అందుకే ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని తెలుగు భాషా దినంగా జరుపుకుంటాము.