: ఈ కాలిక్యులేటర్ వయసు 340 ఏళ్లు
సుమారు 340 ఏళ్ల క్రితం రూపొందించిన కాలిక్యులేటర్ ఒకటి వేలానికి వచ్చింది. దీనికి అత్యధిక ధర పలకవచ్చని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. అప్పుడు కూడా గణిత లెక్కలను కాలిక్యులేట్ చేయడానికి కాలిక్యులేటర్‌ను ఉపయోగించారని దీన్ని బట్టి తెలుస్తుంది.
లండన్‌లోని దక్షిణ కెన్సింగ్‌టన్‌లో క్రిస్టీ సంస్థ పదిహేడో శతాబ్దానికి చెందిన ఒక కాలిక్యులేటర్‌ను వేలానికి పెట్టింది. దీన్ని అక్టోబరు పదిన వేలం వేయనున్నారు. దీని పొడవు 32.5 సెంటీమీటర్లు, వెడల్పు 14.5 సెంటీమీటర్లు ఉండి పాకెట్ పరిమాణంలో ఉంటుంది. ఇప్పడు కంప్యూటర్ల యుగం నడుస్తోంది. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాచీన గణన పరికరాల్లో ఇదొకటని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ కాలిక్యులేటర్ సుమారు పది లక్షల రూపాయలు (లక్ష పౌండ్లు) ధర పలకవచ్చని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కాలిక్యులేటర్‌ని పర్షియన్ యంత్రకారుడు, గడియారాల తయారీదారు రేనే గ్రిల్లెట్ డి రోవెన్ 1673లో రూపొందించారు.