: దిగ్విజయ్ జీ... విప్ జారీ చేయొద్దు: రఘువీరా
రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశంలేదన్న విషయం దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలతో స్పష్టమైందని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విభజన అంశం శాసనసభలో చర్చకు వచ్చినప్పుడు అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వాలన్నారు. పార్లమెంటులో ఉభయ సభల్లో విభజన అంశంపై చర్చ సమయంలో విప్ జారీ చేయొద్దని దిగ్విజయ్ ను కోరామని రఘువీరా తెలిపారు. దిగ్విజయ్ ను కలిసిన వారిలో మంత్రులు రఘువీరా, ఆనం, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఉన్నారు.