: ఇన్ఫోసిస్ సీఈవో పోటీదారు అశోక్ వేమూరి రాజీనామా
ఇన్ఫోసిస్ ఉన్నతోద్యోగి అశోక్ వేమూరి రాజీనామా ప్రకటించారు. సంస్థలో అత్యధిక వేతనమందుకుంటున్న భారతీయుడిగా పేరొందిన అశోక్ వేమూరి తన పదవికి రాజీనామా చేసినట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. గత పదిహేనేళ్లుగా ఇన్ఫోసిస్ లో ఉన్న అశోక్ వేమూరి ప్రస్తుతం బోర్డు డైరెక్టర్ గా, మాన్యుఫాక్చరింగ్, ఇంజనీరింగ్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి గట్టి పోటీదారుగా భావించిన అశోక్ రాజీనామా చేయడం కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆయన 2012-13 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న వేతనం 5 కోట్ల రూపాయలు.