: చంచల్ గూడ జైలు వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తల హల్ చల్
చంచల్ గూడ జైలు వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి విడతల వారీగా తరలి వచ్చిన కార్యకర్తలు జగన్ కు మద్దతుగా నినాదాలు చేశారు. భద్రతను పెంచిన పోలీసులు జైలు వద్ద రహదారిని ముళ్ల కంచెతో పూర్తిగా మూసివేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైలు గేటుకు వందమీటర్ల దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి పలు జిల్లాల నుంచి కార్యకర్తలు గ్రూపులుగా వచ్చి జగన్ కు సంఘీభావంగా ఆందోళనకు దిగారు. కార్యకర్తలు రోడ్డుపైనే నిరసన చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పాతబస్తీకి వెళ్లే రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు జగన్ దీక్ష చేపట్టి నాలుగు రోజులైనా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు అధికారులు తెలిపారు.