: పోరాడి సాధించిన రాష్ట్రాన్ని వారిద్దరే ముక్కలు చేశారు: మైసూరా రెడ్డి
దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కలిపి ముక్కలు చేశాయని వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడుతూ, సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే, ప్రజల భావాలు తెలుసుకోకుండా రాజధాని కోసం నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అడిగాడని మండిపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, బాబు ఇచ్చిన లేఖను వాపస్ తీసుకుంటే రాష్ట్రం యథాతథంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. విభజనకు ముందు వేయాల్సిన కమిటీలను ఇప్పుడు వేయడమేంటని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. సమైక్యంగా ఉంచేందుకు ఏమాత్రం ప్రయత్నించని కాంగ్రెస్, టీడీపీలే రాష్ట్రం ముక్కలవడానికి కారణమని ఆయన ఆరోపించారు.