: హైదరాబాద్ తో కూడిన తెలంగాణకే టీడీపీ మద్దతు: ఎర్రబెల్లి
హైదరాబాదుతో కూడిన తెలంగాణకే టీడీపీ కట్టుబడి ఉందని, దీనికే మద్దతు ఇస్తుందని ఆ పార్టీ తెలంగాణ ప్రాంత సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. జగన్ దీక్షపై కాంగ్రెస్ ఆరా తీయడం ఆ పార్టీ నిజస్వరూపాన్ని తెలియజేస్తోందన్నారు. జగన్ ను తీహార్ జైలుకు తరలిస్తే సమైక్యాంధ్ర ఉద్యమం ఆగిపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.