: బంగారం @ రూ.34,420.. ఒక్కరోజులో 2వేలు ప్రియం


బంగారం ధర చుక్కలనంటింది. రూపాయి విలువ రెండు రోజుల్లోనే 5 శాతం(300 పైసల వరకు) పడిపోవడంతో.. ఈ రోజు కమోడిటీ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర 2వేల రూపాయలు పెరిగి 34,420 రూపాయలకు చేరుకుంది. బంగారం ధరల చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ గరిష్ఠ స్థాయి. అటు వెండి కూడా 59,800 రూపాయలకు చేరుకుంది. మరోవైపు హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో మాత్రం బంగారం 10 గ్రాములకు వెయ్యి రూపాయలు పెరిగింది. 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం 33,510 రూపాయలు, 22క్యారట్ల ఆభరణాల బంగారం 33,000 రూపాయలు, వెండి ధర 59,050 రూపాయలుగా ట్రేడవుతోంది.

  • Loading...

More Telugu News