: మనదేశంలో భారీ ప్రాజెక్టు
మనదేశంలోని తమిళనాడులో ఒక భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు సైన్స్ పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టు. సుమారు 1500 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు ద్వారా వాతావరణ న్యూట్రినోల తీరుతెన్నులపై పరిశోధన సాగించనున్నారు.
భారతదేశంలోని తమిళనాడులో మధురై సమీపంలోని పొట్టిపురం అనే గ్రామంలో ఒక లోతైన నేలమాళిగలో భారత ప్రభుత్వం ఒక ప్రయోగశాలను నిర్మించతలపెట్టింది. ఇండియా`బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ (ఐఎన్‌ఓ) అనే పేరుగల ఈ ప్రాజెక్టు ద్వారా వాతావరణ న్యూట్రినోల తీరుతెన్నులపై పరిశోధన సాగించనుంది. దీన్ని భారత అణు ఇంధన శాఖ చేపడుతోంది. ఈ ప్రాజెక్టుకోసం తమిళనాడు ప్రభుత్వం 66 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చింది.