: భీమిలి ఎమ్మెల్యేకు దిగ్విజయ్ ఫోన్


రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ కు తలబొప్పి కట్టిస్తున్నట్టున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో రగులుకున్న సమైక్య జ్వాలలు నేటికి మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోనూ ఆ ప్రత్యాందోళనలు పొడసూపుతున్నాయి. హైదరాబాదులో ఉద్యోగుల మధ్య నెలకొన్న ఆవేశాలు క్రమంగా తెలంగాణ అంతటా పాకే ప్రమాదంలేకపోలేదు. ఈ విషయం డిగ్గీరాజాకు తెలియంది కాదు. అందుకే నష్టనివారణ చర్యలు మొదలుపెట్టారు.

సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను బుజ్జగించే పనిలో పడ్డారు. సమైక్యాంధ్ర కోసం విశాఖలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన భీమిలి శాసనసభ్యుడు అవంతి శ్రీనివాస్ తో ఆయన ఈ రోజు ఫోన్ లో మాట్లాడారు. వెంటనే దీక్ష నిలిపివేయాలని సూచించారు. అయితే, ఎమ్మెల్యే.. దిగ్విజయ్ సూచనను తిరస్కరించారు. ప్రజల అభిమతం మేరకు దీక్ష చేపట్టానని, ఇప్పుడు ఆపలేనని శ్రీనివాస్ స్పష్టీకరించారు.

  • Loading...

More Telugu News