: 'కాకినాడ-సికింద్రాబాద్' మధ్య ప్రత్యేక రైళ్లు.. ఉద్యమం ఎఫెక్ట్
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా హైదరాబాదు నుంచి కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెడుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 29 నుంచి కాకినాడ నుంచి సికింద్రాబాద్, 30వ తేదీన సికింద్రాబాద్ నుంచి కాకినాడకు రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తాయని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ రెండు రైళ్లను ఏర్పాటుచేశారు.