: సోనియా ఆరోగ్యంపై మోడీ ఆందోళన


ఎప్పుడూ రాజకీయ కోణమేనా? కాసింత మానవీయ కోణంలోనూ ఆలోచించేందుకు నేతలు ప్రయత్నిస్తే ఎంత బావుంటుంది! గుజరాత్ సీఎం, బీజేపీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ సరిగ్గా ఇలాగే ఆలోచించి తన సహృదయతను చాటుకున్నారు. నిన్న సాయంత్రం పార్లమెంటులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురికావడం పట్ల ఆయన ట్విట్టర్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యంపై వాకబు చేసిన మోడీ.. సోనియా త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఆమెను సభ నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలో అత్యవసర వైద్య విధానాలను పాటించలేదని ఆరోపించారు. అన్ని సదుపాయాలు ఉన్న అంబులెన్స్ లో తరలించి ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News