: ఆధార్ గడువు పెంచమని కోరుతూ దానం లేఖ


ఆధార్ కార్డు గడువు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రమంత్రి వయలార్ రవికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. ఆధార్ ప్రక్రియ పూర్తి కావడం కోసం మరో మూడు నెలల సమయం కావాలని లేఖలో కోరినట్లు దానం తెలిపారు.

హైదరాబాద్ లోని పొదుపు సంఘాల మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో
దానం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచనతో పేదలకు మంచి చేసే అభయ హస్తం పథకంపై పొదుపు సంఘాలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News