: అన్నా హజారే దేశ వ్యాప్త 'చైతన్య యాత్ర'
సామాజిక కార్యకర్త అన్నా హజారే, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ త్వరలో దేశవ్యాప్తంగా 'చైతన్య యాత్ర' చేయనున్నారు. గతంలో మధ్యలో నిలిపివేసిన ఈ యాత్రను పునఃప్రారంభించనున్నట్టు వీకే సింగ్ వెల్లడించారు. బీహార్ నుంచి యాత్రను ప్రారంభిస్తామని సింగ్ చెప్పారు. ఎన్నికల్లో మంచివారిని ఎన్నుకునేలా ఓటర్లను చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతోనే యాత్రను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సరైన వారిని ఎన్నుకుంటే వ్యవస్థలో సానుకూల మార్పులు రావచ్చొన్నారు. ప్రస్తుతం అన్నా, సింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు.