: ఒక్క పరీక్ష మీ ఆరోగ్యానికి రక్షా కవచం
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం. రోజుకో పరీక్షలో ఇప్పటికే రెండింటి గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మరొక ముఖ్యమైన రక్త పరీక్ష గురించి తెలుసుకుందాం.
వైద్య పరీక్ష - 3
కొవ్వుతో జీవక్రియలకు ఎంత లాభం ఉందో శ్రుతి మించితే అంతకంటే హాని కూడా ఉంటుంది. కొలెస్టరాల్ అనేది కాలేయం ద్వారా ఉత్ప్తత్తయ్యే ఒక రసాయనం. కొవ్వులో ముఖ్యంగా రెండు రకాలున్నాయి. మంచి, చెడు. మంచి కొవ్వునే హెచ్ డీ ఎల్ కొలెస్టరాల్ అంటారు. ఇది ఎంత ఎక్కువ ఉంటే మీ ఆరోగ్యం అంత గట్టిగా ఉన్నట్లు. మంచి కొవ్వు ఆరోగ్యానికి రక్షా కవచంలా పనిచేస్తుంది. బీపీ, గుండె జబ్బులు సహా పలు రకాల సమ్యలను మీ దరిచేరనీయకుండా కాపాడుతుంది.
మరి మంచి కొవ్వు నేడు ఎంత మందిలో ఎంత శాతం ఉంటుంది..? చాలా తక్కువ మందిలోనే ఇది ఉండాల్సిన స్థాయిలో ఉంటుంది. ఎక్కువ మందిలో ఇది వెతికి చూస్తే ఉండాల్సినంత కూడా కనిపించదు. కొందరిలో మరీ తక్కువగా ఉంటుంది. హెచ్ డీ ఎల్ కొలెస్టరాల్ 65 పాయింట్లకు పైన ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది. అదే సమయంలో 40 పాయింట్ల లోపు ఉందంటే మీపై వ్యాధులు దాడి చేయడానికి సదా సిద్ధంగా ఉన్నట్లే.
మరి మంచి కొవ్వు నేడు ఎంత మందిలో ఎంత శాతం ఉంటుంది..? చాలా తక్కువ మందిలోనే ఇది ఉండాల్సిన స్థాయిలో ఉంటుంది. ఎక్కువ మందిలో ఇది వెతికి చూస్తే ఉండాల్సినంత కూడా కనిపించదు. కొందరిలో మరీ తక్కువగా ఉంటుంది. హెచ్ డీ ఎల్ కొలెస్టరాల్ 65 పాయింట్లకు పైన ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది. అదే సమయంలో 40 పాయింట్ల లోపు ఉందంటే మీపై వ్యాధులు దాడి చేయడానికి సదా సిద్ధంగా ఉన్నట్లే.
ఇక చెడు కొవ్వు.. దీనినే ఎల్ డీఎల్ కొలెస్టరాల్ అంటారు. ఇది ఎక్కువగా ఉండడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది ఎంత తక్కువగా ఉంటే మీ ఆరోగ్యం అంత భద్రంగా ఉన్నట్లు. 100 పాయింట్లలోపు ఉంటే చాలా మంచిది. 130 వరకు ఉంటే పర్లేదు. అంతకు మించితే పలు సమస్యలకు కారణమవుతుంది. అధికంగా ఉండే ఈ చెడు కొవ్వు రక్తనాళాలలో పేరుకు పోయి, రక్త ప్రసారానికి అవాంతరాలు ఏర్పడి బీపీ పెరిగిపోవడం, గుండె, కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారిగా గుండెపోటు, పక్షవాతం, బ్రెయిన్ స్ర్టోక్ కూడా రావచ్చు.
అందుకే, ఈ కొవ్వు పరిమాణాలను ఎప్పటికప్పుడు రక్త పరీక్ష ద్వారా చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లిపిడ్ ఫ్రొఫైల్ అనే టెస్ట్ ను 25 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి చేయించుకోవాలి. 45ఏళ్లు దాటిన వారైతే ఆరు నెలలకోమారు చేయించుకోవాల్సి ఉంటుంది. చెడు కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటే అది తగ్గేందుకు వైద్యులు మందులు సూచిస్తారు. వాటిని వాడడం ద్వారా నియంత్రణలో పెట్టుకోవచ్చు.
మంచి కొవ్వును దండిగా పెంచుకోవాలంటే రోజూ చక్కటి వ్యాయామం చేయడమే పరిష్కారం. మీరు చేసే వ్యాయామంతో బాగా చెమటలు పట్టాలి. వేగవంతమైన నడక చాలా మంచిది. వ్యాయామం మంచి కొలెస్టరాల్ కోసమే కాదు, చెడు కొలెస్టరాల్ తగ్గించడానికీ మంచి ఉపాయం. ఇక ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓట్స్, చేపలు, బాదం, వాల్ నట్స్, పిస్తా, పండ్లు (అరటి, యాపిల్, బెర్రీలు), బీన్స్, బార్లీ, బ్రొక్కోలీ, క్యాబేజీ, క్యారెట్లు, మొలకెత్తిన ధాన్యపు గింజలు పరిమితంగా వేళకు తీసుకోవాలి. నూనె ఎక్కు వగా ఉండే పదార్థాలు, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.