: సమైక్యాంధ్రకు మద్దతుగా 20 వేల మంది విద్యార్ధులతో భారీ ర్యాలీ
విజయనగరం జిల్లాలో రాష్ట్ర విభజన నిర్ణయంపై నిరసనలు మిన్నంటుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలోని జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, బీఈడీ కళాశాలల విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు కళాశాలల పిలుపు మేరకు 20 వేల మంది విద్యార్ధులు, అధ్యాపకులు, ఆర్టీసీ కార్మికులు మయూరి కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. కాగా, గరివిడిలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. ఈ సందర్భంగా బొత్స మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేయాలని సమైక్యవాదులు నినాదాలతో డిమాండ్ చేశారు.