: అందువల్లే మత్తుకు బానిసలవుతున్నారట


కొన్ని రకాల మత్తు పదార్ధాలకు మనవారు ఇట్టే బానిసలవుతుంటారు. అయితే ఇంత త్వరగా ఎలా మత్తుమందుకు బానిసలవుతున్నారు? అనే విషయంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మన మెదడును కొన్ని గంటల్లోనే కొకైన్‌ స్వాధీనం చేసుకుంటుందని తమ పరిశోధనలో తేల్చారు. దానివల్లే ప్రజలు తొందరగా మత్తుపదార్దాలకు బానిసలవుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికాలోని ఎర్నెస్ట్‌ గ్యాలో క్లినిక్‌ పరిశోధనా కేంద్రానికి చెందిన పరిశోధకులు కొకైన్‌ వినియోగం వల్ల మెదడు ఏ విధంగా మత్తుపదార్దాల పట్ల ఆకర్షితమవుతుందో తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఎలుకలకు మత్తుపదార్ధాలను ఇచ్చి, తర్వాత ప్రత్యేక మైక్రోస్కోపు ద్వారా వాటి మెదడు నరాల్లో వచ్చిన తేడాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనలో కొకైన్‌ వినియోగం వల్ల కొన్ని గంటల్లోనే మెదడు ఆకృతిలో తేడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ పరిణామమే మనుషులు మత్తుపదార్ధాలకు బానిసలుగా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News