: తొగాడియా, సింఘాల్ లను రిలీజ్ చేయండి: అలహాబాద్ హైకోర్టు


విశ్వహిందూ పరిషత్ ముఖ్యనేత ప్రవీణ్ తొగాడియా, అశోక్ సింఘాల్, బీజేపీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతిలను విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామజన్మ భూమివద్ద ఆలయం నిర్మించాలన్న డిమాండుతో నిన్న ఫైజాబాద్ లో వీహెచ్ పీ 'కోసీ పరిక్రమ్ యాత్ర' మొదలుపెట్టింది. ఈ సమయంలో వీరి ముగ్గురితో పాటు 1700 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంటనే అరెస్టు అన్యాయమంటూ దాఖలైన పిటిషన్ పై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News