: రౌడీ ట్రాఫిక్ ఎస్సైపై వేటు


శనివారం సాయంత్రం మాదాపూర్ లోని కొత్తగూడ వద్ద మిఠాయి వ్యాపారి రాకేష్ పాటిల్ పై నోపార్కింగ్ బోర్డుతో దాడి చేసి, పెన్నుతో కంటికి తీవ్ర గాయం చేసిన రౌడీ ట్రాఫిక్ ఎస్సై బాలూ నాయక్ ను విధుల నుంచి తప్పించినట్టు సైబరాబాద్ కమీషనర్ తెలిపారు. శనివారం రాకేష్ పాటిల్ మిఠాయి దుకాణం బయట పార్కింగ్ కు అనుమతి లేకున్నా వాహనాలు ఎందుకున్నాయని ఎస్సై ప్రశ్నించాడు. తనకు తెలియదని సమాధానం చెప్పడంతో ఆగ్రహం చెందిన ఎస్సై బాలూనాయక్ నోపార్కింగ్ బోర్డుతో పాటిల్ ను చితకబాదాడు. పెన్నుతో అతని కంట్లో గుచ్చి పైశాచికానందాన్ని పొందాడు. దీంతో స్థానికులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఎస్సై పారిపోయాడు.

  • Loading...

More Telugu News