: బాంబే హైకోర్టులో సల్మాన్ పిటిషన్


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మద్యం తాగి కారు నడిపి ఫుట్ పాత్ పై ఓ వ్యక్తి మరణానికి కారణమైన కేసులో ఇప్పటికే అతనిపై కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట ఈ కండలవీరుడు www.salmankhanfiles.com పేరుతో ఓ వెబ్ సైట్ ను ప్రారంభించాడు. ఇందులో తన కేసుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాడు. విచారణ వివరాలను వెబ్ సైట్లో పెట్టడం ద్వారా సల్లూ కోర్టును ధిక్కరించాడంటూ హేమంత్ పాటిల్ అనే సామాజిక కార్యకర్త బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన న్యాయస్థానం, జులై 10న అతనికి నోటీసులు జారీ చేసి, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో, సల్మాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై రేపు కోర్టు విచారణ జరపనుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News