: కోర్టుకు హాజరైన ధర్మాన, సబిత
మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వీరిరువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, శ్యామ్యూల్, బీపీ ఆచార్య కూడా కోర్టుకు హాజరయ్యారు.