: బాక్సాఫీసు రికార్డు సృష్టించిన 'చెన్నైఎక్స్ ప్రెస్'


బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించి దేశంలోనే టాప్ ఎర్నింగ్ ఫిల్మ్ గా 'చెన్నైఎక్స్ ప్రెస్' చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు 'త్రీ ఇడియట్స్' పేరుమీద ఉండేది. తాజాగా 'త్రీఇడియట్స్' ను వెనక్కి నెట్టి 'చెన్నైఎక్స్ ప్రెస్' రికార్డు బ్రేక్ చేసింది. ఈ సినిమా 202.67 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. గతంలో త్రీఇడియట్స్ దేశంలో 202.47 కోట్లను వసూలు చేసింది. కాగా 'చెన్నైఎక్స్ ప్రెస్' సినిమా దర్శకుడు కూడా రికార్డుల కెక్కాడు. ఆయన తీసిన నాలుగు సినిమాలు కూడా వందకోట్ల క్లబ్ లో చేరాయి. అందులో ఒకటి ఏకంగా రెండు వందల కోట్లు దాటేసింది. ఇప్పుడు 'చెన్నైఎక్స్ ప్రెస్' లక్ష్యం దేశం లోపల, బయట కూడా 'త్రీఇడియట్స్' సాధించిన 392 కోట్ల రూపాయల కలెక్షన్లను అధిగమించడమే. అయితే ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదంటున్నారు సినీ విశ్లేషకులు.

  • Loading...

More Telugu News