: ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కాంగ్రెస్ ఆటలాడుతోంది: సుష్మాస్వరాజ్
ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోందని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు సజావుగా నడవకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. తెలంగాణపై ఈ సమావేశాల్లో బిల్లు పెడితే తాము మద్దతిస్తామని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణపై తేల్చకుండా ఆంధ్రప్రజలతో నాటకాలాడుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.