: వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఛత్తీస్ గఢ్ మావోయిస్టులు
ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇద్దరు మావోయిస్టులు వరంగల్ రేంజి డిఐజి ఎం.కాంతారావు ముందు ఈ రోజు లొంగిపోయారు. పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటి సభ్యుడు యం.దులారాం అలియాస్ యోగేష్(38), బిజాపూర్ జిల్లా ఏరియా కమిటి సభ్యురాలు కె.పొజ్జె అలియాస్ అనిత అనారోగ్యం కారణంగా లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాకు చెందిన యోగేష్ పై మొత్తం వంద కేసులు ఉండగా, వాటిలో 13 కేసులు హత్యలకు సంబంధించినవే. అతడిపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం గతంలో 1. 60 లక్షల బహుమానాన్ని ప్రకటించింది. ఇక, అనిత 2001లో మావోయిస్టు ఉద్యమంలో చేరింది. ఈమెపై ఎనిమిది కేసులు నమోదవగా, పట్టిచ్చినవారికి లక్ష రూపాయల బహుమానం అనే ప్రకటన అమలులో ఉంది.