: రెండువందల మంది బీజేపీ, వీహెచ్ పీ కార్యకర్తల అరెస్టు
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామజన్మ భూమి వద్ద ఆలయం నిర్మించాలన్న డిమాండుతో రేపటి నుంచి ప్రారంభం కానున్న విశ్వ హిందూ పరిషత్ యాత్రపై ఆ రాష్ట్ర సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు ఫైజాబాద్ లో రెండువందల మంది బీజేపీ, వీహెచ్ పీ కార్యకర్తలను అరెస్టు చేశారు. మరో మూడు వందల మంది కార్యకర్తలకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. మత ఘర్షణలు జరుగుతాయన్న నిర్ణయంతో ఇప్పటికే ఈ యాత్ర నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే, యాత్ర సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిని ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నట్లు ఫైజాబాద్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ విపిన్ కుమార్ ద్వివేది తెలిపారు. అంతకుముందు 70 మంది వీహెచ్ పీ ప్రధాన నేతలకు అరెస్టు వారెంట్లు జారీ చేశామన్నారు.