: చిరు ఇంట ముగిసిన సీమాంధ్ర సమావేశం
కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీల సమావేశం ముగిసింది. నిన్న సోనియాతో జరిగిన భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను తన సహచర మంత్రులు, ఎంపీలకు చిరంజీవి వివరించారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించుకున్నట్టు సమాచారం. సభలో సస్పెన్షన్ నేపథ్యంలో అవలంభించాల్సిన వైఖరి పట్ల కూడా చర్చించినట్టు తెలుస్తోంది.