: జగన్ చెప్పడంతో దీక్ష విరమించిన విజయమ్మ
సమైక్యాంధ్ర కోసం ఆరు రోజులుగా గుంటూరులో దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష విరమించారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో అంతకుముందు చికిత్సకు నిరాకరించారు. అయితే, చంచల్ గూడ జైలు నుంచి ఫోన్ ద్వారా జగన్ తన తల్లి విజయమ్మతో మాట్లాడారు. ఇందుకు అధికారులు అనుమతించారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమించాలని జగన్ విజయమ్మకు నచ్చజెప్పారు. దాంతో, విజయమ్మ దీక్ష విరమణకు అంగీకరించారు. మెరుగైన చికిత్స కోసం విజయమ్మను మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హైదరాబాద్ తరలించనున్నారు.