: బీఎస్ఎన్ఎల్ 'స్వాగతం ప్రీపెయిడ్' ప్లాన్ కొనసాగింపు


'స్వాగతం ప్రీపెయిడ్' ప్లాన్ కు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ రావడంతో దానిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. దీనిని ప్రయోగాత్మకంగా ఈ ఏడాది మే నెలలో అమల్లోకి తీసుకొచ్చారు. 21 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 180 రోజుల కాలవ్యవధి లభిస్తుంది. మొదటి రెండు నెలల పాటు అన్ని లోకల్ నంబర్లకు రెండు సెకన్లకు ఒక పైసా చొప్పున చార్జ్ ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ నంబర్లకు చేసే ఎస్ఎంఎస్ లకు 5 పైసలు, ఇతర నంబర్లకు చేసే ఎస్ఎంఎస్ లకు 15 పైసల చార్జ్ చేస్తారు.

రెండు నెలల తర్వాత నుంచి బీఎస్ఎన్ఎల్ నంబర్లకు చేసే కాల్స్ సెకనుకు 1.2 పైసల చొప్పున చార్జ్ చేస్తారు. ఇతర నెట్ వర్క్ మొబైల్స్ కు సెకనుకు 1.5పైసలు చొప్పు చార్జ్ ఉంటుంది. దీంతో పాటు మొదటి రెండు నెలల కాలంలో ఉచిత టాక్ వ్యాల్యూ, ఉచిత ఎస్ఎంఎస్, డేటాను కూడా బీఎస్ఎన్ఎల్ స్వాగతం ప్లాన్ లో అందిస్తోంది. మరిన్ని వివరాలకు 1503కు కాల్ చేయవచ్చని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News