: సేంద్రియ టమోటాలే బెస్టు


మనలోని ఒత్తిడిని తగ్గించడంలో టమోటాలు కూడా సాయం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వాటిలో కూడా సంప్రదాయ పద్దతిలో కాకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన టమోటాలే బాగా పనిచేస్తాయట. బ్రెజిల్‌లోని ఫెడరల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సెరాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో సంప్రదాయ పద్ధతిలో పండించిన టమోటాల కన్నా సేంద్రియ పద్ధతిలో పండించిన టమోటాల్లో ఒత్తిడిని నిరోధించే శక్తి ఎక్కువగా ఉందని తేలింది.

సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలతో పోలిస్తే సంప్రదాయ పద్ధతిలో పండించే టమోటాలు నలభైశాతం చిన్నవిగా ఉంటాయని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు. అందువల్లే సేంద్రియ ఎరువులతో పండించే టమోటా మొక్క ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటుందని, అంతేకాక ఇలా పండించిన టమోటాల్లో చక్కెర, విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీంతో ఒత్తిడిని తగ్గించే విషయంలో సేంద్రియ పద్ధతుల్లో పండించే టమోటాలు దివ్యంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News