: ఈ గడియారం కచ్చితమైంది


ప్రపంచంలో అత్యంత కచ్చితంగా సమయాన్ని సూచించే ఒక కొత్త గడియారాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ గడియారం ఎంత కచ్చితం అంటే సమయాన్ని గుర్తించడంలో దీని తర్వాతే ఏదైనా... అంటే ఇది సమయాన్ని గుర్తించడంలో ఎంత తేడా చూపుతుందంటే ఇతర గడియారాలతో పోలిస్తే దీనిలో వచ్చే తేడా క్వింటిలియన్‌ (అంటే ఒకటి తర్వాత 18 సున్నాలు పెట్టాలి)లో రెండు భాగాల కన్నా తక్కువే ఉంటుంది. అంత కచ్చితంగా ఇది సమయాన్ని చూపుతుందట.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎస్‌టీ)కి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన గడియారాన్ని రూపొందించారు. ఈ గడియారం ఇతర గడియారాలతో పోలిస్తే పదిరెట్లు మెరుగ్గా కచ్చితమైన సమయాన్ని చూపుతుందట. ఈ కొత్త గడియారం ఇట్టెరిబియం అణువుల ఆధారంగా తయారైంది. ప్రయోగాత్మకంగా రూపొందించిన రెండు గడియారాలు స్థిరత్వం విషయంలో ఒక కొత్త రికార్డును సృష్టించాయి. దాదాపు పదివేల ఇట్టెరిబియం అణువులను 10 మైక్రోకెల్విన్‌ స్థాయికి శీతలీకరించి, లేజర్‌ కాంతితో కూడిన ఆప్టికల్‌ జాలకంలో బంధించడం ద్వారా దీన్ని రూపొందించారు. ఇంతపెద్ద సంఖ్యలో అణువులు ఉండటం వల్ల ఈ గడియారం చాలా స్థిరంగా ఉండగలదు. దీనిద్వారా కచ్చితమైన ఫలితాలను వేగంగా పొందవచ్చు. ఈ గడియారంతో సమయ నిర్ధారణేకాకుండా దిశానిర్దేశ వ్యవస్థ, అయస్కాంత క్షేత్రాలు, ఉష్ణోగ్రత వంటి అంశాల్లో కూడా చాలా ఉపయోగాలున్నాయి.

  • Loading...

More Telugu News