: విభజన ప్రక్రియ ముందుకు సాగదనుకుంటున్నా: చిరంజీవి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ ముగిసిన అనంతరం కేంద్రమంత్రి చిరంజీవి పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగుతుందని తాను అనుకోవడంలేదన్న ఆయన, వెనక్కి వెళుతుందని కూడా అనుకోవడంలేదని చెప్పారు. హైదరాబాద్ తోనే ప్రతి ఒక్కరి జీవితాలు ముడిపడి ఉన్నాయని, ఈ నగరం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పుడే సమన్యాయం జరుగుతుందని అనుకుంటున్నట్లు చెప్పారు. తాను సమైక్యవాదినని, తనపై సమైక్యవాదుల కోపాన్ని అర్ధం చేసుకోగలనన్నారు. ప్రజలకు న్యాయం జరగని పక్షంలో వారి కోరికను (రాజీనామా) నెరవేరుస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరు లోక్ సభ నుంచి ఎంపీల సస్పెన్షన్ పై విచారం వ్యక్తం చేశారు. వారి ఆందోళన న్యాయమైనదేనన్నారు.