: సోమవారం లోక్ సభలో 'ఆహార భద్రత బిల్లు'
దేశంలో దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూర్చనున్న 'ఆహార భద్రత బిల్లు'ను సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. అదే రోజు బిల్లుపై చర్చ జరిపి, పాస్ చేయనున్నట్లు చెప్పారు. కాబట్టి, సభ్యులెవరూ ఎలాంటి పనులమీద విదేశాలకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇప్పటికే బిల్లుపై పలువురు సభ్యులు మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కాగా, గల్లంతైన బొగ్గు శాఖ ఫైళ్లపై సభలో చర్చించేందుకు స్పీకర్ తేదీని నిర్ణయిస్తారన్నారు.