: తెలంగాణ ప్రాంత మంత్రుల సమాలోచనలు


మంత్రి జానారెడ్డి ఛాంబర్లో నగరంలో అందుబాటులో ఉన్న తెలంగాణ ప్రాంత మంత్రులంతా సమావేశమయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలపై, పార్లమెంటు జరుగుతున్న తీరుపైనా ఈ సమావేశంలో చర్చించారు. పోటీ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చిన తెలంగాణ వెనక్కిపోకుండా ఉండేలా అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రాంత మంత్రులు ఆభిప్రాయపడ్డారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో తెలంగాణ సాధన విజయోత్సవ వేడుకలను జరపాలనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. అలాగైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంబరాలను జిల్లాస్థాయిల్లోనే కాక గ్రామస్థాయిలో కూడా జరపాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ రోజు జానా, పొన్నాల, సారయ్య, గీతారెడ్డి మాత్రమే అందుబాటులో ఉండడంతో రేపు తమ ప్రాంతానికి చెందిన అందరు మంత్రులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.

  • Loading...

More Telugu News